![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -542 లో.... అమూల్య దగ్గరికి విశ్వ వచ్చి మాట్లాడాలని ట్రై చేస్తాడు. అసలు నాతో నీకేం మాటలు అని కోప్పడుతుంది. నా చెల్లి ప్రేమ మీ అన్న ధీరజ్ గురించి వాళ్ళు ఇద్దరికి ఒకరంటే ఒకరికి బాగా ఇష్టం కానీ వాళ్ళు విడిపోయి చాలా బాధపడుతున్నారు.. వాళ్ళని మనం ఒకటి చేద్దామని విశ్వ అనగానే ఇదొక డ్రామానా మీ ఫ్యామిలీ వల్లే వాళ్ళు విడిపోయారు.. మీరు మారిపోయారంటే అసలు నమ్మలేనని అమూల్య అంటుంది. నేను మారిపోయానని విశ్వ ఎంత చెప్పినా అమూల్య అసలు నమ్మదు.
ఆ తర్వాత తిరుపతి, ధీరజ్ డ్రింక్ చేస్తారు. అసలు ఆ ప్రేమ ఏమనుకుంటుంది మావ.. సెక్యూరిటీ నా గురించి అడిగినప్పుడు నా భర్త అని చెప్పాలి కదా అలా చెప్పకుండా ఎవరో అంటావా అని ధీరజ్ అంటాడు. తిరుపతి ఒక చీర చుట్టుకొని ఇప్పుడు నేను ప్రేమ అనుకొని నీ ఫ్రస్ట్రేషన్ బయట పెట్టమని తిరుపతి అంటాడు. ధీరజ్ ఫ్రస్ట్రేషన్ లో తిరుపతిని కొడుతాడు. అదంతా ప్రేమ చూసి బయటకు వస్తుంది. ప్రేమని చూసి అబ్బో వచ్చింది శత్రుదేశపు యువరాణి అని ధీరజ్ అంటాడు. ఏంటే రాత్రిపూట తిరుగుతున్నావు.. అవును దెయ్యాలు రాత్రే తిరుగుతాయి కదా అని ధీరజ్ అంటాడు. దాంతో ప్రేమ కోపంగా అక్కడ నుంచి వెళ్తుంది.
మరొకవైపు నర్మద నిద్రపోకుండా ఒక బోర్డుపై ఆపరేషన్ ప్రేమ ధీరజ్ అని రాసి అసలు ఎందుకు ప్రేమ ధీరజ్ విడిపోయారని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది.అదంతా సాగర్ చూసి ఏంటి అది అని అడుగుతాడు. ఏం లేదు ప్రేమ, ధీరజ్ విడిపోవడానికి కారణం కనిపెట్టాను.. అసలు వాళ్ళు ధీరజ్ ని రెచ్చగొట్టి గొడవ చెయ్యాలనే ప్లాన్ తో ఇక్కడికి వచ్చారని నర్మద అనగానే అంత లేదు.. అసలు వాళ్ళు విడిపోవడానికి కారణం మా అమ్మ, నువ్వు, ధీరజ్ అని సాగర్ అంటాడు. మరుసటిరోజు ఉదయం ధీరజ్ , తిరుపతి తాగి గేట్ దగ్గర పడుకొని ఉంటారు. అదంతా విశ్వ పైనుంచి చూస్తాడు. అప్పుడే ప్రేమ వాళ్ళపై వాటర్ చల్లుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |